వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలని, చెరువులు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని లయన్స్ క్లబ్ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు.
గత పది సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ నుంచి మట్టి విగ్రహాలు పంచుతున్నట్టు వారు తెలిపారు. ప్రతి ఏటా మెట్పల్లి పట్టణ కేంద్రంలో దాదాపు 2వేల విగ్రహాలను పంచుతున్నట్టు వివరించారు.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?