ETV Bharat / state

కేసీఆర్ అవాస్తవాలతో ప్రచారం చేసుకుంటున్నారు: భాజపా కిసాన్ మోర్చా - జగిత్యాల ధాన్యం కొనుగోలు కేంద్రం

కేసీఆర్ అవాస్తవాలతో కూడిన ప్రచారం చేసుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం తూకంలో మోసం, రవాణాకు సంబంధించి ఇబ్బందులు, మిల్లర్లతో సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

campaigning-with-kcr-mandates-bjp-kisan-morcha
కేసీఆర్ ఆవాస్తవాలతో ప్రచారం చేసుకుంటున్నారు: భాజపా కిసాన్ మోర్చా
author img

By

Published : May 20, 2020, 7:20 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు సందర్శించారు. రైతుల ధాన్యం తూకంలో మోసం, రవాణాకు సంబంధించి ఇబ్బందులు... మిల్లర్లతో సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో పండించే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అంతా తానే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని సుగుణాకర్ రావు విమర్శించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర తక్కువేనని ఆరోపించారు. కేసీఆర్ ఆవాస్తవాలతో కూడిన ప్రచారం చేసుకుంటున్నారని.. ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.