ETV Bharat / state

'ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కేసీఆర్ రూ.వేలకోట్లు పంపిస్తున్నారు' - బండి ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay on Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Dec 12, 2022, 1:48 PM IST

Updated : Dec 12, 2022, 2:05 PM IST

Bandi Sanjay on Delhi Liquor Scam: దిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బి.. దిల్లీ పోయావో ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం కేసుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 15న మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్​లో జరగనుందని బండి సంజయ్ తెలిపారు. ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరవుతారన్నారు. జనసమీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరీంనగర్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి, కేసీఆర్​కు ఛాలెంజ్ విసురుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చలిగల్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కేసీఆర్ రూ.వేలకోట్లు పంపిస్తున్నారు'

'కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. సమైక్యాంధ్ర చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోరు. గతంలో తెలంగాణలో యాగం చేశాక ప్రజలకు ఏం న్యాయం చేశారు? సీబీఐ రావొద్దని చెప్పడానికి మీరెవరు? 'ధరణి' పేరుతో భూములు దండుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో భాజపా ఓటమికి కేసీఆర్ రూ.వేలకోట్లు పంపిస్తున్నారు.'- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.