Auto Drivers Reaction On Free Bus Service In Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం ఆఫర్‌ను ప్రారంభించడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు బస్సుల్లో సంతోషంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం మహిళలకు మేలు చేస్తున్నా ఆటోలపై ఆధారపడి ఉన్న డ్రైవర్లకు మాత్రం నిరాశే మిగులుస్తోంది.
రాష్ట్రంలో ఆటో నడుపుతూ వేలాదిమంది డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ తదితర మండలాల్లో సుమారు 1000కి పైగా ఆటో, జీపులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది మహిళా ప్రయాణికులు ఈ వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు ఆటోల్లో ప్రయాణించడం మానేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు
Auto Drivers on Maha Lakshmi Scheme in Telangana : ఉచిత ప్రయాణం ఆఫర్ మహిళలకు కలిసి వచ్చినా, ఆటో డ్రైవర్లను మాత్రం దెబ్బతీస్తోంది. ఈ పథకం వల్ల మహిళలు ఎవరూ ఆటోల్లో ప్రయాణించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. సాధారణంగా తమ ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది మహిళలేనని, ఇప్పుడు ఈ పథకం వల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. అప్పు చేసి మరీ ఫైనాన్స్‌తో ఆటోలను కొనుగోలు చేశామని, ఈ ఉచిత ప్రయాణంతో ప్రయాణికులు రాక ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. మరోవైపు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మేము ఆటోను నడపడం ద్వారా రోజుకు 600- 800 రూపాయలు సంపాదింస్తున్నాం. వచ్చిన ఆదాయం ద్వారా రోజువారి సరకులు కొనగలిగే వాళ్లం. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పుడు గిరాకీ లేక ఉపాధి కోల్పోయాం. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత గిరాకీ తగ్గిపోయింది. మా జీవనోపాధి, పిల్లల చదువులు కష్టంగా మారింది. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా కష్టాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి." - ఆటో డ్రైవర్లు
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం
Auto Drivers Submitting Requests To Authorities : తమను ఆదుకోవాలని ప్రజావాణిలో ఆటో డ్రైవర్లు అధికారులకు వినతులను సమర్పించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉచిత ప్రయాణం బాగానే ఉన్నా ప్రయాణికులపై ఆధారపడి ఉన్న తమను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఏదోరకంగా ఉపాధి అందించేలా చూడాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మంచు కురిసే వేళ డ్రైవింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే!
Ride Cancel : వాళ్లదో సమస్య.. వీళ్లదో సమస్య.. ఇలా అయితే ఎలా..!