ఇవీ చూడండి: ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మొక్కలు నాటేందుకు వెళితే కొడవలితో దాడి - గ్రామ కార్యదర్శి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వ అధికారుల ప్రాణాలపై దాడులకు దారి తీస్తుంది. జగిత్యాల జిల్లా ముత్యంపేటలో మొక్కలు నాటించేందుకు వచ్చిన గ్రామ కార్యదర్శిపై ఖాజాఖాన్ తన భూమిలో ఎందుకు చదును చేస్తున్నారని కొడవలితో దాడికి దిగాడు.
మొక్కలు నాటేందుకు వెళితే కొడవలితో దాడి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో రోడ్డు పక్కన హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటించేందుకు వచ్చిన గ్రామ కార్యదర్శిపై ఖాజాఖాన్ అనే వ్యక్తి కొడవలితో దాడికి యత్నించాడు. గ్రామ కార్యదర్శి జమీల్ జేసిబీతో స్థలాన్ని చదును చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఖాజాఖాన్ తన భూమిలో ఎలా చేస్తారంటూ గొడవకు దిగాడు. ఇంకా కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి కొడవలితో దాడికి పాల్పడ్డాడని కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో ప్రాణభయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి జమీల్ తెలిపారు.
ఇవీ చూడండి: ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Intro:Body:Conclusion: