జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని కార్లకు ప్రమాదం జరిగింది. వాహనశ్రేణిలో ఒకదానికొకటి 5 కార్లు ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని ముందు కారులో ఎమ్మెల్సీ కవిత వెళ్లిపోయారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు.
ఉదయం జగిత్యాల వచ్చిన కవిత... జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దు: జానారెడ్డి