పురపాలక ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పలు సిబ్బందికి పలు సూచనలు చేశారు. బల్దియాలోని సమావేశ గదిలో సిబ్బందితో కలిసి నామినేషన్ల కోసం కావలసిన ఏర్పాట్లను చూశారు. మొత్తం 26 వార్డులలో మూడు వార్డులు చొప్పున తొమ్మిది కౌంటర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం