జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. హనుమాన్‌నగర్, దుబ్బవాడ, మార్కెట్ రోడ్ ప్రాంతాలకు చెందిన ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
![5 corona cases at metpally in jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-12-21-coronakesulu-av-ts10037_21032021154018_2103f_1616321418_285.jpg)
ఫలితంగా అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుల ఇళ్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి పాటించాలని సూచించారు. గుంపులు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: గురుకులంలో కరోనా కలకలం.. మొత్తం 26 మందికి పాజిటివ్