జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు లింగారెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం లింగారెడ్డి తన ఇంటి సమీపంలో కూర్చొని ఉండగా 20 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వల్ల వైద్యులు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు.