ETV Bharat / state

కొవిడ్ మహమ్మారిని జయించిన పదినెలల చిన్నారి - jagtial district news

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పిల్లా పెద్దా, ఉన్నోడు లేనోడు అన్న తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తోంది. వైరస్ బారిన పడిన వారు సరైన చికిత్స పొందకపోతే ఊపిరొదిలిన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో పది నెలల చిన్నారి ఈ మహమ్మారిని జయించింది.

baby fought back corona, covid cases
కరోనాపై చిన్నారి గెలుపు, కరోనాను జయించిన చిన్నారి
author img

By

Published : May 21, 2021, 12:42 PM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్, రాధిక.. వారి పది నెలల వయస్సు గల కుమార్తె ఆరాధ్యకు గత నెలలో కరోనా సోకింది. ముగ్గురు హోంఐసోలేషన్​లో ఉండి.. వైద్యుల సలహాలు, పౌష్టికాహారం తీసుకున్నారు. చిన్నారికి కూడా వైద్యుల సలహాతో.. మందులు వేశారు.

ఈ క్రమంలో మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోగా.. ముగ్గురికి నెగెటివ్ వచ్చింది. పది నెలల చిన్నారి కరోనా మహమ్మారిని జయించడం పట్ల కుటుంబంతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

కొవిడ్ మహమ్మారిని జయించిన పదినెలల చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.