ETV Bharat / state

జిల్లా, మండల పరిషత్​ ఛైర్మన్ల ఎన్నిక నోటిఫికేషన్​

మండల, జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ల ఎన్నిక తేదీ ఖరారైంది. జిల్లా పరిషత్​ ఛైర్​ పర్సన్లు, వైస్​ ఛైర్​ పర్సన్లు, కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక జూన్ ఎనిమిదో తేదీన... అలాగే మండల పరిషత్​ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక జూన్​ ఏడో తేదీన జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది.

ఎన్నికల సంఘం
author img

By

Published : May 29, 2019, 8:18 PM IST

మండల, జిల్లా పరిషత్​ ఛైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. మూడు విడతల్లో జరిగిన మండల, జిల్లా పరిషత్​ ఎన్నికల ఫలితాలు జూన్​ 4 వెలువడనున్నాయి. మండల పరిషత్​ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక జూన్​ ఏడో తేదీన... జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్​ పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జూన్ ఎనిమిదో తేదీన జరగనుంది. మండల పరిషత్​ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక కోసం జూన్ ఆరో తేదీన, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్​ పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం జూన్ ఏడో తేదీన నోటీస్ జారీ చేస్తారు.

జిల్లా, మండల పరిషత్​ ఛైర్మన్ల ఎన్నిక నోటిఫికేషన్​

అదే రోజు ఎన్నిక

మంగపేట, బూర్గంపాడు, జడ్చర్ల మినహా మిగతా ఎంపీపీలకు ఎన్నిక నిర్వహిస్తారు. నోటిఫికేషన్​ రోజే నామినేషన్లు స్వీకరించి ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల వరకు నామపత్రాలు స్వీకరించి... 12 గంటల లోపు పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఒంటి గంటకు చేపడతారు. ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం మధ్యాహ్నం మూడు గంటలకు పాలకమండళ్ల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. పరోక్ష ఎన్నిక ద్వారా ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల నిర్దేశించిన రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:లోక్​సభాపక్ష నేత ఎంపికపై తెరాస కసరత్తు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.