ETV Bharat / state

'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...! - zoom app unsafety explained by cyber expert nallamothu sridhar

లాక్​డౌన్​ నేపథ్యంలో సమాచార మార్పిడి కోసం అధికారులు జూమ్​ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్​లు చేస్తున్నారు. అయితే ఈ అప్లికేషన్​ అంత సురక్షితం కాదని గుర్తించి కేంద్రం.. దాన్ని వినియోగించద్దని నిర్దేశించింది. అయితే ఇది ఎందుకు సురక్షితం కాదనే విషయాన్ని సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్​ వివరించారు.

zoom app unsafety explained by cyber expert nallamothu sridhar
'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!
author img

By

Published : Apr 17, 2020, 1:57 PM IST

లాక్​డౌన్​ కారణంగా అంతర్జాల వినియోగం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారం మార్పిడి కోసం వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తున్నారు. అయితే వరకు ఉపయోగిస్తున్న జూమ్​ అప్లికేషన్​ అంత సురక్షితం కాదని గుర్తించిన కేంద్రం.. దాన్ని వినియోగించద్దని నిర్దేశకాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రముఖ సైబర్​ నిపుణులు నల్లమోతు శ్రీధర్​తో మా ప్రతినిధి శ్రీకాంత్​ ముఖాముఖి...

'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!
  • కేంద్రం జూమ్​ ఆప్​ ఎందుకు వినియోగించవద్దని నిర్దేశించింది?

2011లో వీడియో కాన్ఫరెన్స్​ కోసం జూమ్ యాప్​ను తీసుకొచ్చింది. లాక్​డౌన్​ తర్వాత దాని వినియోగం 200 నుంచి 300 రెట్లు వరకు అప్లికేషన్​ వినియోగం పెరిగింది. ​ రక్షణపరంగా జూమ్ యాప్​లో చాలా లొసుగులు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. యాప్​ ద్వారా బయటకు వెళ్లే డాటా రెండు రకాలుగా ఉంటుంది.

1. వెబ్​ డాటాలో టీసీపీ, ఐపీ పాకెట్స్ ద్వారా వెళ్తాయి. వీడియో డాటా అయితే యూడీపీ పాకెట్స్ ఉంటాయి. ఇవి ఎన్​క్రిప్టెడ్​ ద్వారా ఉంటే పర్వాలేదు. లేని పక్షంలో... మధ్యలో ఎవరైనా హ్యాకర్స్ ఈ డాటాను దొంగలించే అవకాశముంటుంది.

2. ఫ్రీ అకౌంట్​ కలిగిన వారికి చైనా సర్వర్ల ద్వారా మనకి వీడియో కాల్స్​ జరుగుతున్నాయి. దీనివల్ల అక్కడి ప్రభుత్వం వీటిపై నిఘా పెట్టి మన డాటాను చోరీ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి.

  • ఇలా హ్యాక్​ అయిన అంశాలేమైనా మనకి బయటకు వచ్చాయా?

సింగపూర్​లో ఇలాంటి ఘటన ఒకటి బయటకువచ్చింది. టీచర్లు, విద్యార్థుల మధ్య జరిగే వీడియో తరగతుల్లో పాకెట్ స్నిప్పర్స్​ ద్వారా డాటా చోరీకి గురైంది. ఆ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు చూపించే వీడియో కాకుండా హ్యాకర్స్​ విడుదల చేసిన అశ్లీల చిత్రాలు విద్యార్థులకు కనిపించాయి. ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నందున మన ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది.

  • ఇలాంటి ఘటనలపై సదరు సంస్థ యాప్​లో ఏమైనా మార్పులు చేసిందా?

వాస్తవంగా జూమ్​ చుట్టూ ఎన్నో లొసుగులు ఉన్నాయనేవి వెల్లడయ్యాక సంస్థ ప్రతినిధులు కొన్ని మార్పులు చేసింది. సభ్యులు వీడియో కాల్స్ చేసినప్పుడు పైన కనిపించే ఐడీ నంబరును ఎవరికీ కనిపించకుండా చేసింది. ప్రీమియం అకౌంట్​ ఉన్న వారికి వచ్చే డాటాను ఏ సర్వర్​ నుంచి రావాలో ఎంచుకునే సదుపాయాన్ని కల్పించింది. కానీ ఇండియా లాంటి దేశాల్లో ఇలాంటివి చాలా చిన్న మార్పులు.

ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.