ETV Bharat / state

YS Sharmila sensational comments : 'ఆంధ్రప్రదేశ్​లో పార్టీ పెడతారా..?' షర్మిల రెస్పాన్స్ ఇదే..! - తెలంగాణ వార్తలు

YS Sharmila sensational comments : ఏపీలో పార్టీ పెట్టడంపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్‌ ఏం లేదు కదా? అని మీడియా చిట్​చాట్​లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila sensational comments, sharmila chit chat
ఆంధ్రప్రదేశ్​లో పార్టీ పెడతారా..? షర్మిల రెస్పాన్స్ ఇదే..!
author img

By

Published : Jan 3, 2022, 2:19 PM IST

YS Sharmila sensational comments : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్‌ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.

రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా. మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నం. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతు ఆవేదన యాత్రకి అనుమతి లేదంటున్నారు. నిబంధనల ప్రకారం పోతామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదు. రైతుబంధుకు, పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నిబంధనలు తీసుకొస్తున్నారు. భాజపా, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. ఇష్యూని డైవర్ట్ చేసేందుకు భాజపానీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు.

-వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

వైతెపాలో చేరిన తెరాస సీనియర్‌ నేత

తెరాసకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీయే ప్రత్యామ్నాయమని గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్‌ఆర్‌కు జిరాక్స్‌ కాపిలా షర్మిల కనిపిస్తోందని తెలిపారు. తెరాస సీనియర్‌ నేత, బీసీ నాయకుడు గట్టు రాంచందర్‌రావు ఇవాళ వైతెపాలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్‌ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ లెగసీ ఎక్కడకు పోలేదని అయన వ్యాఖ్యానించారు. భాజపాతో దోస్తీ కోసమే కేసీఆర్ తపనపడుతూ... బండి సంజయ్‌ను హైలెట్ చేస్తున్నారని గట్టు రాంచందర్‌రావు ఆరోపించారు. రాబోయే రోజుల్లో భాజపాతో కలిసి కేసీఆర్ పనిచేస్తారని వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: Tension over tribal varsity committee concern: గిరిజన వర్సిటీ సాధన కమిటీ ఆందోళనలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.