YS Sharmila respond on Viveka murder case: ఆంధ్రప్రదేశ్లో వివేకా హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ షర్మిల స్పందించారు. దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమని అన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు. తమ చిన్నాన్నను ఘోరంగా ఎవరు హత్య చేశారో బయటకి రావాలని తెలిపారు.
వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసుకు రాజకీయ కారణాలపై సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం అంటే తెరాస పతనానికి నాంది: ఎంపీ లక్ష్మణ్