ETV Bharat / state

'విద్యార్థుల కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోరాటం చేయాలి' - Initiation of YS Sharmila

YS Sharmila fire on CM KCR: జెండాలు వేరైనా.. ఒకే అజెండాతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదికగా తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ వేకెన్సీ అండ్ ఎంప్లాయిమెంట్ (టీ-సేవ్) పేరుతో పోరాడాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ 10న ఒక కామన్ ఏరియాలో కూర్చొని ఈ విషయంపై చర్చించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఏ ఏడాదికి ఆ ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే.. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఇంతలా ఉండేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

YS Sharmila
YS Sharmila
author img

By

Published : Apr 3, 2023, 2:16 PM IST

YS Sharmila fire on CM KCR: విద్యార్థుల కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై.. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసికట్టుగా ఒకతాటిపై వచ్చి ఒక్కటిగా పోరాటం చేస్తే దేశమంతా చూస్తుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవం చేస్తుందని అభిప్రాయపడిన ఆమె.. సీఎం కేసీఆర్ ఏ ఏడాదికి ఆ ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగ సమస్య ఇంతలా ఉండేది కాదని అన్నారు.

ఐఎంఐఎ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. దేశం మొత్తం మీద ఉన్న నిరుద్యోగంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2 శాతం అధికంగా నిరుద్యోగం ఉందని పేర్కొన్నారు. బిస్వాల్ కమిటీ సూచన ప్రకారం రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్..​ 33 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చారని మండిపడ్డారు. అందులో 8 వేలకు మాత్రమే పరీక్షలు జరగగా.. అందులో లీకులతో విఫలమయ్యారని ఆరోపించారు.

ఏప్రిల్​ 10న కామన్​ ఏరియాలో కూర్చొని నిర్ణయం తీసుకోవాలి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని.. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్​ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తొమ్మిది ఏళ్ల పాలనలో ఎన్ని గ్రూప్-​1 ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించిన ఆమె.. తెలంగాణ యువకులు గ్రూప్​-1 ఉద్యోగాలు చేయకూడదా అంటూ దుయ్యబట్టారు.

ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏప్రిల్ 10న ఒక కామన్ ఏరియాలో కూర్చొని ఈ విషయంపై చర్చించుకోవాలని సూచించారు. నిరుద్యోగ సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి ఆచార్య కోదండరాం, లేదా మరొకరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదన్నారు. టీఎస్​పీఎస్సీని ప్రశ్న పత్రాలు అమ్మే అంగడిగా మార్చారని ఆరోపించారు. డ్రగ్స్, నయీం, జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసుల్లో దోషులను ఇప్పటివరకూ తేల్చని సిట్‌పై ప్రజలకు భరోసా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

"విద్యార్థుల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకంగా పోరాడతాం.. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం.. ఏప్రిల్ 10న ఒక కామన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతిపక్షాలను బతకనిస్తున్నారా మీరు..? ఇంత వరకు ఎన్ని సిట్​లు వేశారు? ఎంత మంది దోషులను శిక్షించారు. తెలంగాణ వచ్చిన తరువాత ఇంత వరకు ఎన్ని గ్రూప్​-1 నోటిఫికేషన్లు ఇచ్చారు? తెలంగాణను పోరాడి తెచ్చుకున్న యువత ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదా..?"- వైఎస్​ షర్మిల

ఇవీ చదవండి:

కలిసి నడుద్దాం.. నిలిచి పోరాడదామంటూ షర్మిల లేఖ.. విపక్షాలు ఓకే చెప్పేనా..?

TSPSC పేపర్ లీక్‌ పెద్ద స్కామ్.. ఇందులో వారి హస్తం ఉంది: వైఎస్‌ షర్మిల

టెన్త్ ఎగ్జామ్స్​ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల స్టంట్స్​ చూస్తే..!

ముందొకరు.. వెనుకొకరు.. ఇద్దరు అమ్మాయిలతో​ స్టంట్స్​.. అడ్డంగా బుక్కైన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.