ETV Bharat / state

"కాళేశ్వరం అవినీతి దేశం మొత్తం తెలిసేలా రేపు దిల్లీలో ధర్నా" - దిల్లీలో షర్మిల దీక్ష

YS Sharmila Darna at Delhi: 'కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి దేశం మొత్తానికి తెలిసేలా దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద మార్చి 14వ తేదీన ధర్నా చేస్తున్నట్లు' వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రకటించారు. రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిన 2జీ, కోల్ ​గేట్​కు తీసిపోని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.

YS Sharmila Darna
YS Sharmila Darna
author img

By

Published : Mar 13, 2023, 4:19 PM IST

YS Sharmila Darna at Delhi: కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అట్టర్​ ప్లాప్​ ప్రాజెక్టు అని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆరోపించారు. రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిన 2జీ, కోల్ ​గేట్​ కుంభకోణాలకు ఏమాత్రం తీసుపోని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి దేశం మొత్తం తెలిసేలా రేపు దిల్లీలోని జంతర్​ మంతర్​ నుంచి పార్లమెంట్​ భవనం వరకు నడుచుకుంటూ శాంతియుతంగా ధర్నా చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

లోటస్ పాండ్​లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా విచారణ ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. తాను చేస్తున్న ధర్నాకు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై స్పందించిన షర్మిల.. "ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైతే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని" ఎద్దేవా చేశారు. దీనిపై బీఆర్​ఎస్​ ఎంపీలు నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

" కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది. 2జీ, కోల్​ గేట్​ కుంభకోణాల కంటే పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. అది ఒక అట్టర్​ ప్లాప్​ ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశం మొత్తం తెలిసేలా రేపు దిల్లో ధర్నా చేస్తున్నా.. దీనికి అన్ని పార్టీల ఎంపీలు మద్దతు కావాలని కోరుతున్నాను. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు".- వైఎస్​ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

YS Sharmila arrested in Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే షర్మిల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఈనెల 8న మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి.. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్ష చేయగా.. పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు.

అనంతరం మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. ఒక్క కవితకు తప్ప ఎవరికి రక్షణ లేదని విమర్శించారు. అత్యాచారాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 20వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: షర్మిల

"రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దాం".. విపక్షాలకు వైస్​ షర్మిల లేఖ

వామ్మో.. ఆస్కార్ కోసం రూ. 463,92,47,300 ఖర్చు చేశారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.