ETV Bharat / state

లాడ్జ్​లో యువతి, యువకుడు ఆత్మహత్య - లాడ్జ్​లో యువతి యువకుడి ఆత్మహత్య

Young Man and Young Woman Commits Suicide: ఏపీలోని తిరుపతిలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. మృతులు హైదరాబాద్‍కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరికి చెందిన అనూషగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Suicide
Suicide
author img

By

Published : Nov 8, 2022, 3:52 PM IST

Young Man and Young Woman Commits Suicide: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి నగరంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడ వీధిలోని ఓ ప్రైవేట్‍ లాడ్జికి నిన్న ఉదయం 7 గంటల సమయంలో.. యువతీ, యువకుడు వచ్చారని పోలీసులు తెలిపారు. 24 గంటలు గడిచినా వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా వారిద్దరు ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం.. మృతులు హైదరాబాద్​కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.