ETV Bharat / state

తల్లిదండ్రులూ పారాహుషార్‌... మత్తును వదిలించాల్సింది మీరే! - Drugs latest updates

మత్తుమందులు కొనేందుకు డబ్బుల్లేక తొమ్మిదో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా తన నగ్నచిత్రాలు అమ్మేందుకు సిద్ధపడింది. హైదరాబాద్‌ ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన మరో ఇంజినీరింగ్‌ విద్యార్థేమో దొంగగా మారాడు. ముందు ఇంట్లో నగదు చోరీ చేసేవాడు. అవి కూడా సరిపోకపోవడం వల్ల వాహనాల దొంగతనం మొదలుపెట్టాడు. మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు మత్తుమందులు కొనేందుకు డబ్బులు ఇవ్వకపోతే కన్నతల్లినే కొట్టేవాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ తర్వాత సమయానికి అవి దొరక్కపోతే చోరీలు చేయడానికే కాదు ఇంకా పెద్ద పెద్ద నేరాలకూ వెనుకాడరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మత్తు సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది. ఇందులో చిత్తవుతున్న వారిలో సింహభాగం యువతే. పిల్లలు అటువైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తొలుత తల్లిదండ్రులదేనని నిపుణులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులూ పారాహుషార్‌... మత్తును వదిలించాల్సింది మీరే!

author img

By

Published : Jan 4, 2021, 12:07 PM IST

ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండటం వల్ల ఎక్కువ మంది గంజాయిని ఆశ్రయిస్తున్నారు. దీంతో పాటు కొకైన్‌, హెరాయిన్‌, ఓపియం, ఎల్‌ఎస్‌డీ ద్రావణాలు వంటి వాటిని తీసుకుంటున్నారు. మత్తుమందులు వినియోగిస్తున్న వారిలో 80 శాతం యువతే.

చదువుల విషయంలో తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి కూడా కొంతమంది పిల్లలు వ్యసనాల బారినపడటానికి కారణమవుతోంది. కారణాలు ఏవైనా కావచ్చు ఆవేశంతోనో.. ఆనందం కోసమే మొదలవుతున్న ఈ అలవాటు వ్యసనంగా మారుతోంది. పిల్లల్లో ఈ అలవాటు వారి భవిష్యత్తునే కబళిస్తోంది.

తల్లిదండ్రులూ.. ఇలా వద్దు

* మార్కులు, ర్యాంకులు అంటూ నిత్యం పిల్లల వెంటపడడం, ఒక్క మార్కు తక్కువొచ్చినా వారిని అవమానించడం, మా పరువు తీశావంటూ సూటిపోటి మాటలు పసిమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల పిల్లల్లో అభద్రతా భావం పెరిగిపోయి ఉద్వేగాల్ని నియంత్రించుకోలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని సందర్భాల్లో చెడు సావాసాల చెరలో చిక్కుకుంటున్నారు.

* అతి క్రమశిక్షణ, విపరీతమైన స్వేచ్ఛ. ఈ రెండూ కొన్ని సార్లు బెడిసి కొడుతున్నాయి.

* కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నిత్యం ఘర్షణ పడటం, ఒకర్నొకరు దూషించుకోవడం వంటివి తరచూ చోటుచేసుకుంటాయి. వారి పిల్లలపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఆ సంఘర్షణ నుంచి బయటపడేందుకు చాలా మంది కొత్త కొత్త ఆకర్షణలకు లోనై వాటిల్లో ఆనందం వెతుక్కుంటున్నారు.

* ఏదో కారణంతో తల్లిదండ్రులు విడిపోయిన కొన్ని కుటుంబాల్లో పిల్లలపై సరైన పర్యవేక్షణ కొరవడి వారు పక్కదారి పడుతున్నారు. తండ్రి వ్యసనాలకు బానిసై, బాధ్యతలు విస్మరించిన పలు కుటుంబాలకు చెందిన పిల్లల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటోంది.

పిల్లల కోసం కొంత సమయం..

* నిత్యజీవితంలో ఎంత తీరికలేకుండా ఉన్నా సరే పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు కచ్చితంగా కొంత సమయం కేటాయించాల్సిందే.

* పిల్లల అవసరాలకు తగ్గట్టు డబ్బు ఇవ్వాలి. వారు ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనించాలి.

* ప్రేమపూర్వక, స్నేహపూర్వక వాతావరణం ఇంట్లో ఉండేటట్లు చూసుకోవాలి.

* పిల్లలు ఎలాంటి స్నేహితులతో మెలుగుతున్నారు? ఇంటికి ఎన్నింటికి వస్తున్నారు? బయటకు వెళ్లాక వారి ప్రవర్తన, ధోరణి ఎలా ఉంటోంది? వంటి అంశాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఈ వ్యసనం బారిన పడకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశాఖపట్నంలోని ‘గ్రీన్‌ వ్యాలీ ఫౌండేషన్‌’ వ్యసన విముక్తి కేంద్ర నిర్వాహకురాలు ఉమారాజ్‌, విజయవాడకు చెందిన మానసిక నిపుణులు డా.టీఎస్‌.రావు వివరించారు.

పిల్లల నడవడిక నిత్యం గమనిస్తుండాలని, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంటున్నారు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించి డీఎడిక్షన్‌ కేంద్రాల్లో చేర్పించాలని వారు సూచిస్తున్నారు.

* ప్రవర్తనలో విపరీతమైన మార్పులు.. అంటే చిన్న చిన్న విషయాలకూ విపరీతమైన కోపం తెచ్చుకోవడం. అసలు తినకపోవడం. ఒక్కోసారి అతిగా తినడం. వ్యక్తిగత శుభ్రత గురించి పట్టించుకోకపోవడం. కుటుంబ సభ్యులతో కలవడానికి ఇష్టపడకపోవడం.

* ఇంట్లో అప్పుడప్పుడూ డబ్బులు, విలువైన వస్తువులు మాయమవు తుండటం.

* చదువులో, పనితీరులో చురుకుదనం తగ్గటం.

* ఇష్టమైన వ్యాపకాలు, క్రీడలు, ఇతర అంశాలపై ఆసక్తి కనబరచకపోవడం.

* ఏకాగ్రత లేకపోవటం, పరధ్యానంగా ఉండటం.

* విపరీతమైన దూకుడుతో వ్యవహరించడం.

* రహస్యంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుండటం.

* నిత్యం మత్తులో ఉన్నట్లు అనిపించడం. కళ్లు ఎర్రగా మారడం

* బరువు తగ్గిపోవడం.

* తల్లిదండ్రుల కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడలేకపోవడం.

విద్యాసంస్థలదీ ప్రధాన బాధ్యతే...

* విద్యార్థులు, యువత రోజులో ఎక్కువ సమయం గడిపేది విద్యాసంస్థల్లోనే. మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న వారిని గుర్తించి అటువైపు ఆకర్షితులివ్వకుండా చేయడంలో విద్యాసంస్థలదీ కీలక పాత్రే.

* తరగతి మిత్రుల ద్వారానే చాలా మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. చెడు వ్యసనాలకు లోనైన ఒక విద్యార్థి మిగతా వారినీ ఆ బాట పట్టించే అవకాశం ఎక్కువ. అలా సహ విద్యార్థులను చెడు వ్యసనాల బాట పట్టిస్తున్న వారిని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అవసరమైన పక్షంలో వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. వారి తల్లిదండ్రులకు పరిస్థితి వివరించాలి. అప్పటికీ ఎలాంటి మార్పు లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

* విద్యాసంస్థల పరిసరాల్లో ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారా? అనేది పరిశీలించాలి. అలాంటి పరిస్థితి ఉంటే అమ్ముతున్న వారిని హెచ్చరించాలి. అయినా మార్పురాకపోతే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి పట్టించొచ్చు.

* కొన్ని వృత్తివిద్యాసంస్థల్లో విద్యార్థులే మాదకద్రవ్యాల సరఫరాదారులుగా మారుతున్న దృష్టాంతాలు వెలుగుచూస్తున్నాయి. అలాంటి వారిపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి.

* వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు పెంపొందించే బోధన తప్పనసరిగా ఉండేలా చూడాలి.

తెలిసీ తెలియని వయసులో చాలా మంది మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఆ తర్వాత వాటి నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దురలవాట్లు దీర్ఘకాలంలో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

* నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట.

* గొంతులో పుండ్లు, బొంగురు పోవడం.

* చర్మంపై దద్దుర్లు.

* కీలకమైన సిరలు దెబ్బతినడం.

* మెదడుపోటు, అతినిద్ర/నిద్రలేమి.

* రాపిడికి గురై పళ్లు పాడైపోవడం.

* గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్‌ఫెక్షన్లు.

* రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, న్యుమోనియా.

ఇదీ చదవండి: కొలువు సాధించాలంటే... సాధన తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.