అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి హైదరాబాద్ గాంధీనగర్లో పార్సీగుట్ట వద్ద సాయి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చాచా నెహ్రూ నగర్లో నివాసం ఉండే సాయికుమార్ వెల్డింగ్ పని చేస్తుంటాడు. తెల్లవారుజామున స్థానికులకు చెట్టుకు ఉరితో వేలాడుతూ కనిపించాడు. ఘటన స్థలాన్ని గాంధీ నగర్ పోలీసులు పరిశీలించారు. సాయి కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.