ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ అప్పులు పెరిగి యువకుడు దుర్మరణం

లాక్​డౌన్​ కారణంగా అనేక మందికి ఉపాధి దూరమైంది.. డబ్బులు లేక ఓ యువకుడు అప్పులు చేశాడు.. అవి కాస్తా పెరగడం వల్ల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

young man dies the lockdown time at chilkalguda
లాక్​డౌన్​ వేళ అప్పులు పెరిగి యువకుడు దుర్మరణం
author img

By

Published : Apr 25, 2020, 2:52 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దేశబోయిన నారాయణ అనే యువకుడు గచ్చిబౌలిలోని ఓ హోటల్లో రిసెప్షనిస్టుగా పని చేసేవాడు. లాక్​డౌన్ ఉండటం వల్ల డబ్బులు లేక అప్పులు చేశాడు. అవి ఎక్కువయ్యి తీర్చలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గత కొన్ని రోజుల నుంచి అతను చిలకలగూడ పీఎస్ పరిధిలో తన మామ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మామ డ్యూటీకి వెళ్లిన సమయంలో తీవ్ర మనస్థాపం చెంది అలా చేశాడని పోలీసులు పేర్కొన్నారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : పొదుపు సంఘాల సభ్యులకు రూ.5 వేల రుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.