ETV Bharat / state

'సీఎం జగన్​ మా మేనమామ.. నేను కలవాలి' - తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద యువకుడి హడావిడి

Youngman argument: ఏపీలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ యువకుడు హల్​చల్​ చేశాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మేనమామ అంటూ... ఆయనను కలవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు.

young man
'సీఎం జగన్​ మా మేనమామ.. నేను కలవాలి'
author img

By

Published : Jun 3, 2022, 3:47 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయ చెక్‌పోస్టు వద్ద పులివెందులకు చెందిన యువకుడు హడావుడి చేశాడు. తన మేనమామ సీఎంను కలవాలంటూ చెక్‌పోస్టు-4 వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన పేరు వైఎస్‌ సుబ్రమణ్యేశ్వర్‌రెడ్డి అని చెప్పిన యువకుడు.. సీఎంను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించిన పోలీసులు.. విచారణ చేపట్టారు. యువకుడు ఒకసారి తనది పులివెందుల అని.. మరోసారి శ్రీకాళహస్తి అని చెబుతున్నాడన్నారు. యువకుడి మానసిక పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.