ఎక్కువ కాలం జీవించడం కంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా నాణ్యమైన జీవనం గడపడం ముఖ్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యోగా సప్తాహ్–2020 కార్యక్రమాన్ని రాజ్‌భవన్ నుంచి ఆన్లైన్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విరాట్ భారత్ సంస్థ ఆన్లైన్ యోగా సప్తాహ్ 2020 కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి 21 వరకు నిర్వహిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆర్‌యస్‌యస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఐదు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన యోగా ద్వారా సంపూర్ణ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సాధించవచ్చని తమిళిసై తెలిపారు. గైనకాలజిస్ట్ అయిన గవర్నర్ తన అనుభవాన్ని వివరిస్తూ అనేకమంది గర్భిణీ స్త్రీలు యోగా సాధన ద్వారా సిజేరియన్ సర్జరీలు అవసరం లేకుండా కాన్పులు అయ్యేవారని వివరించారు. యోగా కూడా ఒక డాక్టర్ లాగే ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆమె అన్నారు. ప్రధాని మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్