ETV Bharat / state

మురుగు కాలువలోకి దిగి ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే!

MLA Kotamreddy Protest: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి.. నెల్లూరు నగరం ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ycp mla
ycp mla
author img

By

Published : Jul 5, 2022, 3:20 PM IST

మురుగు కాలువలోకి దిగి ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే!

MLA kotamreddy sridhar reddy protest: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాలువ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మరోసారి కాలువలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోగా పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాలువ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.

ఇదీ చదవండి: 'సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.