ETV Bharat / state

రణరంగంగా గన్నవరం.. ఆయుధాలుగా మారిన కర్రలు, రాళ్లు

author img

By

Published : Feb 21, 2023, 1:11 PM IST

Attack on TDP office in Gannavaram : ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గన్నవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే.. కార్లపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. టీడీపీ కార్యాలయంలో సామగ్రిని నాశనం చేశారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధులకి, పోలీసులకి, టీడీపీ కార్యకర్తలకి గాయాలయ్యాయి.

Attack on TDP office in AP
ఏపీలో టీడీపీ కార్యాలయంపై దాడి

Attack on TDP office in Gannavaram : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల అరాచకంతో ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం యుద్ధ భుమిలా మారింది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మనుషులు తెలుగుదేశం కార్యాలయంపై గుంపుగా దాడి చేశారు. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ వంశీకి.. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి బదులిచ్చారు. ఆ తర్వాత గన్నవరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కూడా వంశీపై విమర్శలు వర్షం కురిపించారు.

దాడికి సన్నద్దం: సోమవారం ఉదయమే టీడీపీ నేత దొంతు చిన్నాకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఇంటి మీదకు వెళ్లి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశారు. దీంతో టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశమై.. చర్చించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రదర్శనగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే వంశీ తరఫు కార్యాకర్తలు విధ్వంసానికి దిగారు.

దాడి ఇలా చేశారు: పోలీసులను పక్కకు తోసుకుంటూ టీడీపీ కార్యాలయంలోకి వెళ్లారు. కర్రలు, రాళ్లతో లోపల అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు.. కనబడిన వస్తువులను పగలగొట్టారు. తెలుగు యువత నాయకుడు కోనేరు సందీప్‌ ఇన్నోవా కారుపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.దాంతో పాటు ఇంకో మూడు కార్లను ధ్వంసం చేశారు. దాదాపు గంట పాటు ఈ గొడవ జరిగింది. జై వంశీ అంటూ నినాదాలు చేస్తూ విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులకూ దెబ్బలు తగిలాయి. కానీ పోలీసులు మౌన ప్రేక్షకుల్లా నిలిచారు. సుమారు 50 మంది.. దాడిలో పాల్గొన్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.

అందరి సమక్షంలో కార్లకు నిప్పు: ప్రాంగణంలోని కార్లనూ పగలగొట్టడంతోపాటు.. ఓ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. వంశీకు సన్నిహితులే టీడీపీ కార్యాలయంపై దాడికి స్వయంగా పాల్గొన్నారు. ఈ ఘటనలో ఓలుపల్లి రంగా, గన్నవరం ఎంపీపీ రవి, బాపులపాడు ఎంపీపీ నగేష్, తేలప్రోలు రాముగా పిలిచే భీమవరపు యతేంద్ర రామకృష్ణ.. నల్ల ప్రసాద్, పోతుమర్తి బాబీ, కొల్లి చిట్టి, గొంది పరంథామయ్య..గుడ్డేటి సుధాకర్, త్రిపుర్నేని బాబీ ఈ దాడిలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దృశ్యాలను చూస్తే పక్కా ప్రణాళికతోనే వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

పోలీసులకు దాడి జరుగుతుందని ముందే తెలుసా?: దాడి జరిగిన రోజు టీడీపీ కార్యలయం వైపు నుంచి వంశీ కారుతో ప్రయాణించారు. అతను వెళ్లగానే దాడి మొదలైంది. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీదుగా వంశీ కారు వెళ్లింది. ఎమ్మెల్యే వాహన శ్రేణి వెళ్లగానే దాడి మొదలైంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోగయ్యారు. ఏదో జరగబోతుందని ముందే పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోలేదు.సమాచారం తెలిసిన దాడిని కట్టడి చెయ్యడంలో విఫలమయ్యారు. ఎమ్మెల్యే సన్నిహితుల్ని బతిమాలడం దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో విధ్వాంసాలు జరిగిన తగిన చర్యలు తీసుకోలేదు. పైగా మొబైల్లో ఫోటోలు, వీడియోలు తీస్తూ కన్పించారు.

పలువురికి గాయాలు: దాడి సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుతో పాటు.. టీడీపీ మహిళా నాయకురాలు మండవ లక్ష్మీ,నాయకులు కోనేరు సందీప్, పోక కిరణ్, డ్రైవర్‌ శివ, కార్యాలయ సిబ్బంది సత్య, ఓ దినపత్రిక విలేఖరి గాయపడ్డారు. సీఐని సిబ్బంది ద్విచక్ర వాహనంపై.. గన్నవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిందని విషయం తెలియగానే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం పీఎస్​కు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అదే రోజు రాత్రి మళ్లి దాడి చేసిన అల్లరిమూకలు: సోమవారం రాత్రి 9 గంటల తర్వాత వంశీకు మద్దతుగా.. అల్లరిమూకలు మరోసారి దాడికి దిగారు. దొంతు చిన్నా ఇంటి మీదకు గుంపుగా వెళ్లారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నా కారుపై పెట్రోల్‌ పోసి తగలబెట్టేందుకు యత్నించారు. కారుకు నిప్పంటుకోగా పోలీసులు మంటలు అదుపు చేసి, ఎమ్మెల్యే అనుచరులను వెనక్కి పంపారు. టీడీపీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కార్యకర్తలను అరెస్టు చేసి పార్టీ ఆఫీస్ ఖాళీ చేయించారు. గన్నవరం.. తెలుగుదేశం కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.