లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు జియాగూడ యాదవ్ సంఘం ఆపన్నహస్తం అందిస్తూ ముందుకెళ్తోంది.హైదరాబాద్ జియాగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో 2 వేల పేద కుటుంబాలకు సంఘం సభ్యులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి చోట భౌతిక దూరాన్ని పాటిస్తూ.. కరోనా వ్యాధి వ్యాప్తిపై విస్తృతంగా ప్రచారం చేస్తూన్నారు. నిరుపేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించవద్దన్న సంకల్పంతో తమ సంఘం కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణే నిజమైన నివాళి: సీఎం కేసీఆర్