Nikhath Jareen: హైదరాబాద్ సుచిత్ర అకాడమీలో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సందడి చేసింది. దేశం కోసం బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. 2009లో బాక్సింగ్ ప్రారంభించినట్లు తెలిపిన నిఖత్.. లాక్డౌన్ సమయంలో జిమ్‌లు మూసేయడంతో సుచిత్ర అకాడమీకి వచ్చి శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి అకాడమీలు ఉన్నాయని నిఖత్ చెప్పారు. కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా సుచిత్ర అకాడమీ యాజమాన్యం ప్రదీప్ రాజు, ప్రవీణ్ రాజులు నిఖత్ జరీన్‌కు రూ.10లక్షల చెక్‌ను అందించారు.
ఇటీవల టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిజామాబాద్‌కు చెందిన నిఖత్.
ఇవీ చదవండి: దిల్లీ పీఠాన్ని వణికించిన.. ఎన్టీఆర్ రాజకీయ ధీరత్వం!
'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు'
'బట్లర్ నా రెండో భర్త'.. మరో క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్!