పిల్లలు సెల్‌ఫోన్ ఆటలకే ప్రాధాన్యమిస్తున్న ప్రస్తుత కాలంలో.. ఈ బాలికలు రోజూ ఉదయం, సాయంత్రం 4 గంటల పాటు సాధన చేస్తున్నారు. 14 ఏళ్ల వయస్సులోనే శిక్షణ పొందుతున్నారు. రెజ్లింగ్ శిక్షకుడు నందకిశోర్ గోకుల్ ఆధ్వర్యంలో 12 మంది అమ్మాయిలు కుస్తీ పోటీలకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే అండర్-14లో ముగ్గురు అమ్మాయిలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. కుస్తీ నేర్చుకోవడం వల్ల తమలో ఉన్న భయాందోళనలు దూరమయ్యాయని... ధైర్యంగా సమాజంలో బతుకవచ్చనే భరోసా కలుగుతుందని ఈ అమ్మాయిలుధీమా వ్యక్తం చేస్తున్నారు.
నగరానికి చెందిన అజ్జు, ప్రశాంతి దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావణి, లోచితలను శిక్షణకు పంపిస్తున్నారు. పరిస్థితుల కారణంగా తాను రాణించలేకపోయానని.... తన కలను పిల్లలు సాకారం చేస్తారన్న నమ్మకం ఉందని అజ్జు ధీమాగా ఉన్నాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో 2 దశాబ్దాలుగా సేవలందిస్తోన్న రెజ్లింగ్ శిక్షకుడు నందకిశోర్ గోకుల్... చాలా మంది నిరుపేద ఆడపిల్లలకు ఈ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కుస్తీపై ఉత్సాహం ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చే క్రీడాకారులు తయారవుతారనిపిస్తోంది.
ఇవీ చూడండి: ప్రోత్సహిస్తే రె'ఢీ'