కొందరే ముందుకు
స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మాట వాస్తవమే అయినప్పటికీ... వారి సంఖ్య పురుషుల కంటే తక్కువగా ఉండటం బాధాకరం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అవి సుదూర స్వప్నంగానే మిగిలిపోయాయి. అన్ని సంస్థల్లో మహిళా ఉద్యోగులు ఉంటున్నా... ఉన్నత స్థానాల్లో మాత్రం అతి తక్కువ మందే ఉంటున్నారు. ఉద్యోగం చేస్తున్న ప్రతీ మహిళ ఇంటి, వంట పని చూసుకుంటూనే తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అలా ప్రతిరోజు స్త్రీ పురుషుడి కంటే ఐదారుగంటలు ఎక్కువగా కష్టపడుతుంది. అయినా స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు.
పేరు ఆమెది పెత్తనం అతడిది
స్త్రీలు కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేయాలని రిజర్వేషన్లు తీసుకొస్తే... వారి అధికారాన్ని భర్తలకు అప్పగించేస్తున్నారు కొందరు మహిళామణులు. ఇది ముఖ్యంగా గ్రామ, మండల స్థాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిచిన మహిళల అధికారాన్ని వారి భర్తలు చేతులోక్కి తీసుకుంటున్నారు. మహిళల సమానత్వాన్ని కేవలం ప్రచారాలకు ఆర్భాటాలకు మాత్రమే అంకితమన్నట్లు చూపిస్తున్నారు.
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా మనదేశంలో మహిళలకు సమాన పనికి సమాన వేతనమివ్వకపోవడం దురదృష్టకరం.
ఇవీ చదవండి:బ్యాలెన్స్ ఫర్ బెటర్