ETV Bharat / state

ఉన్నత ఉద్యోగం ఒకవైపు... పర్వతారోహణ మరోవైపు - ap latest news

ఉన్నత ఉద్యోగం చేస్తునే ప్రతియేటా వివిధ ప్రాంతాలకు వెళ్లి పర్వతారోహణ చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఏపీలోని విశాఖకు చెందిన జి. నందిత. పర్వతారోహణ వంటి సాహసోపేతమైన వ్యాపకాలను ఎంచుకుంటే మహిళల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆమె చెబుతున్నారు.

women-trecking-varius-mountains in ap vishakapatnam
ఉన్నత ఉద్యోగం ఒకవైపు... పర్వతారోహణ మరోవైపు
author img

By

Published : Dec 26, 2020, 2:49 PM IST

ఏపీలోని విశాఖ నగరంలోని ఐ.ఐ.ఎం.లో సహాయ మేనేజర్‌ హోదాలో ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగం పర్యవేక్షక అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే ప్రతియేటా వివిధ ప్రాంతాలకు యాత్రలు చేయడం, పర్వతారోహణ(ట్రెక్కింగ్‌)కు వెళ్తూ ఆరోగ్య సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జి.నందిత. పర్వతారోహణ చేయడం లాంటి ఒకింత సాహసంతో కూడుకున్న వ్యాపకాలను ఎంచుకోవడంలో మహిళలు ఆసక్తి చూపడంలేదని... అలాంటి రంగాలపై కూడా దృష్టిసారిస్తే మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

తన విజయప్రస్థానం ఆమె మాటల్లోనే....

"నేను బీచ్‌రోడ్డులో ఉంటాను. నా తండ్రి నాగేశ్వరరావు సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. తల్లి అరుణ గృహిణి. మాకు ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాలకు వెళ్లడం అలవాటు. నాకు ఇంటర్లో 93 శాతం మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్‌కు వెళ్లకుండా సీఏ(ఛార్టెడ్‌ అకౌంటెంట్‌) చేస్తే మంచి అవకాశాలు దక్కుతాయని భావించాను. అందుకు అనుగుణంగా సీఏ పరీక్షలు రాయడానికి వీలుగా కఠోర సాధన చేశాను. సీఏతోపాటు సి.డబ్ల్యు.ఎ.,(కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్‌), సి.ఎస్‌.(కంపెనీ సెక్రటరీ) కోర్సులను చదువుకుని మూడింటినీ విజయవంతంగా పూర్తిచేశాను. ప్రస్తుత విశాఖ ఐ.ఐ.ఎం.లో ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగం పర్యవేక్షక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. " -----జి. నందిత, పర్వతారోహకురాలు.

పర్వతారోహణలో ఎందుకు వెనకబడాలి....

పర్వతారోహణ చేసేవారిలో అత్యధికశాతం మంది పురుషులే ఉంటున్నారు. మహిళల సంఖ్య ఒకింత తక్కువేనని చెప్పాలి. దీంతో పర్వతారోహణకు వెళ్లడాన్ని నా వ్యాపకంగా మార్చుకున్నాను. పర్వతారోహణకు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మహిళలు దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. శారీరక దారుఢ్యం కోసం నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు రెండుగంటలు వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకున్నాను. నేను ఎంచుకున్న వ్యాపకం కారణంగా మరింత ఆరోగ్యవంతమైన జీవనం సాగించగలుగుతున్నాను.

కంబాలకొండతో మొదలుపెట్టాను....

నేను దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగాను. దిల్లీ, పాండిచ్చేరి, కులు మనాలి, రోహ్‌తంగాపాస్, ధర్మశాల, హరిద్వార్, డార్జలింగ్, లోనావాలా తదితర ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్నది నా ఉద్దేశం. ఆయాత్రల్లో భాగంగా నేను సాహసయాత్రలకు వెళ్లే చాలా మందిని చూసి స్ఫూర్తి పొందాను. ముందుగా నగరంలోని కంబాలకొండతో పర్వతారోహణను మొదలుపెట్టాను. కంబాలకొండపై నడవడం పెద్దకష్టమేమీ కానప్పటికీ పర్వతారోహణపై అవగాహన పెంపొందుతుందన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్లాను.

నేపాల్‌లోని సండక్‌పు పీక్‌కు...

డార్జిలింగ్‌ నుంచి సండక్‌పు పీక్‌కు ‘యూత్‌హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (వై.హెచ్‌.ఎ.ఐ.) ఆధ్వర్వంలో పర్వతారోహణకు వెళ్లాను. 12500 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే 51కి.మీ.ల నడవాలి. అందుకు అనుగుణంగా పర్వతారోహణ నిర్వహించే వారు సూచించిన జాగ్రత్తలన్నింటినీ రెండు నెలల ముందు నుంచే పాటించాను. ప్రతిరోజూ సుమారు 35 నిముషాల వ్యవధిలో ఐదు కి.మీ.ల దూరం వరకు నడవగలుగుతున్నానా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించుకునేదాన్ని. ఫలితంగా నాకు బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నాతోపాటు నా స్నేహితురాళ్లు ప్రియాంక, విశాఖ, నవ్య, కోమల్‌ వచ్చారు. నిర్వాహక సంస్థ మరికొందరితో ఏర్పాట్లు చేశారు. ఐదురోజులపాటు జరిగిన పర్వతారోహణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశా.

భర్తతో కలిసి చంద్రశీల పీక్‌కు

2018వ సంవత్సరంలో నాకు వివాహమైంది. నా భర్త కల్యాణ్‌ కూడా నాతోపాటు పర్వతారోహణకు వచ్చారు. 2019వ సంవత్సరం డిసెంబరులో ఉత్తరాఖండ్‌లోని ‘చంద్రశీల’ పీక్‌కు వెళ్లాం. ఆ పర్వతారోహణ కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి కూడా సుమారు 27 కి.మీ.ల దూరం నడిచాం. ఇండియా హైక్స్‌ అనే సంస్థ పర్వతారోహణ ఏర్పాట్లు చేసింది. తీవ్రమైన మంచు పరిస్థితులను కూడా తట్టుకోగలిగాను. 12083అడుగుల ఎత్తులో ఉన్న ఆ పర్వత శిఖరానికి చేరి తిరిగి రావడానికి మొత్తం ఆరురోజుల సమయం పట్టింది. మంచు గుట్టల మధ్య నడుచుకుంటూ చలిగాలుల తీవ్రతను కూడా లెక్క చేయకుండా కొంత దూరం ప్రయాణించడం మరపురాని అనుభూతి. చంద్రశీల పర్వాతారోహణలో నా సోదరి భార్గవి, స్నేహితురాళ్లు, స్నేహితులు సుమారు 15 మంది కూడా పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'సాగర్​' సమరం.. పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.