ETV Bharat / state

నిద్రిస్తున్న మహిళలపై అత్యాచారయత్నం - హైదరాబాద్​ నేరాలు

సమాజంలో స్త్రీలకు రోజురోజుకు రక్షణ లేకుండా పోయింది. మహిళ నడుస్తుంటే... ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసే మృగాళ్లు ఎక్కువే. మగువలు బయట ఉన్నా.. ఇంట్లో ఉన్నా... భద్రత లేకుండా పోయింది. హైదరాబాద్​లో ఓ గుడిసెలో నివసిస్తున్న మహిళలపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు.

మహిళపై అత్యాచార యత్నం
author img

By

Published : Apr 9, 2019, 9:54 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి సాయినగర్​ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మృగాడు కామంతో కళ్లు మూసుకుపోయి... నిద్రిస్తున్న మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించగా... పరుగులు తీశాడు.

అసలేం జరిగిందంటే...

కూకట్​పల్లి సాయినగర్​ కాలనీలో ఓ వాచ్​మెన్​ కుటుంబం, పక్కనే వారి సోదరుడి కుటుంబంతో కలిసి గుడిసెలలో నివాసం ఉంటున్నారు. గత పది రోజుల క్రితం ఓ గుడిసెలో నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని దుండగుడు వచ్చి బలవంతంగా అత్యాచారం చేయబోయాడు. ఆమె తేరుకుని ప్రతిఘటించగా... పారిపోయాడు. బాధితురాలు పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఇదే విషయాన్ని తన సోదరికి తెలుపగా... గత కొద్ది రోజులుగా ఆమె బాధితురాలితో కలిసి నిద్రిస్తుంది. కాగా గత రాత్రి మళ్లీ ఓ గుర్తు తెలియని వ్యక్తి.. అదే గుడిసెలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాధితురాలి సోదరి నోరు మూసి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయగా.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయాడని బాధితురాలు తెలియజేశారు. దుండగుడు పదే పదే అత్యాచారయత్నానికి పాల్పడుతుండటం వల్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళపై అత్యాచారయత్నం

ఇదీ చదవండి : " వంట చేస్తుండగా పేలిన గ్యాస్​ సిలిండర్ "

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.