ETV Bharat / state

'మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను ఈనెల 31లోపు నియమించాలి'

ఈనెల 31లోగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నియమించలేకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

'మహిళ కమిషన్ ఛైర్​పర్సన్​ను ఈనెల 31లోపు నియమించాలి'

author img

By

Published : Dec 2, 2020, 9:25 PM IST

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను ఈనెల 31లోగా నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నియమించలేకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కరీంనగర్​కు చెందిన సామాజిక కార్యకర్త రేగులపల్లి రమ్య రావు రాసిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో కోరినప్పటికీ... ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది.

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ ఏర్పాటుకు ఇంత జాప్యం ఎందుకన్న ధర్మాసనం... ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో వివరించాలని ఆదేశించింది. ఈనెల 31లోగా ప్రక్రియ పూర్తి చేసి మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ను నియమిస్తామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఏజీ వివరణ నమోదు చేసిన హైకోర్టు... ఈనెల 31లోగా నియమించాలని లేని పక్షంలో సీఎస్ హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: గత ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన జీహెచ్ఎంసీ పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.