ETV Bharat / state

మగువల మనసు దోచే గాజులు

author img

By

Published : Jun 30, 2019, 8:03 AM IST

అలంకరణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఆడవారు.. తాము ధరించిన వస్త్రాలకు అనుగుణంగా గాజులను వేసుకోవడం మరిచిపోరు. కొనుగోలు చేయడమే కాస్త ఇబ్బంది. మరి రకరకాల గాజులన్నీ ఒకే దగ్గర దొరికితే... ఇక వారి ఆనందానికి హద్దేముంటుంది. అలాంటి వారికోసమే... ఈ లాడ్ బజార్‌.

మగువల మనసు దోచే గాజులు

మగువల మనసు దోచే గాజులు

చార్మినార్.. ఈ పేరు వినగానే అద్భుత చారిత్రక కట్టడాలు కళ్లముందు కదలాడుతాయి. ముత్యాలు, గాజులు, వస్త్రాలు, అత్తర్లు... ఇలా మగువల మనసు దోచేవెన్నో. అతివల అందానికి మరింత మెరుగులు అద్దుతూ... సౌభాగ్యానికి ప్రతీకగా భావించేవే గాజులు. రకరకాల గాజులన్నీ ఒకే దగ్గర దొరికితే ఆనందానికి హద్దేముంటుంది. భాగ్యనగరంలోనే గాజుల అమ్మకాలకు ప్రతీతి లాడ్​ బజార్. మగవారు వచ్చినా తమకిష్టమైన వారికి ప్రేమ పూర్వకంగా బహూకరించేందుకు కొనుగోలు చేస్తుంటారు. ఇన్నాళ్లు ఈ బజార్‌ గురించి తెలియనివారు అటువైపు వెళితే ఓ లుక్కేయాల్సిందే..

గాజులకు అడ్డా లాడ్‌బజార్‌:

భారతీయ స్త్రీల జీవితంలో ప్రధాన పాత్ర పోషించేవి గాజులు. ఎలాంటి వేడుకల్లో అయినా అతివలు అలంకరణలో భాగంగా గాజులు ధరిస్తారు. ఆకట్టుకునే గాజులకు అడ్డా అంటే చార్మినార్​లోని లాడ్​ బజార్. 400 ఏళ్ల క్రితం ఆరో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీ ఖాన్ భార్య లాడ్లీ బేగం పేరుతో ఈ ప్రాంతం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు.

సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా

లాడ్లీ బేగం వివాహానికి అతిథుల కోసం ఈ లాడ్​ బజార్​ను ఆమె తండ్రి ఏర్పాటు చేశారని అంటారు. మొత్తంగా ఇక్కడి గాజులు నగరవాసులనే కాకుండా దేశవిదేశాల మగువల మనసు దోచుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం చాలా మంది వ్యాపారులు ప్రత్యేకంగా గాజలు తయారుచేసి బహుకరించారు. గతంలో ప్రధానులూ సినీతారాలూ ఇక్కడే గాజులు కొనుగోలు చేశారు. చార్మినార్ పక్కనే ఉన్న ఈ ప్రదేశం కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది.

మెరిపించే గాజులు

విద్యుత్‌ దీపాల కాంతిలో ఈ బజారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒకేలా కనిపిస్తుంది. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగు రంగుల రాళ్ల గాజులు చమక్​ చమక్‌మంటూ పర్యటకుల ముఖాలను మెరిపిస్తూంటాయి. ఎన్ని జతలగాజులు చేతికి ఉన్నా ఊరిస్తూ మరో జత వేసుకోవాలనిపిస్తుంది. లాడ్‌ బజార్‌ కొస్తే మెటల్‌ డైమండ్స్‌, సీసం బ్రాస్‌ ఫైబర్‌, మిర్రర్‌ ఎనామిల్‌ తదితర రకాలు చూసే కొద్దీ తీసుకోవాలనిపిస్తుంది.

తయారీకి నాలుగు గంటల సమయం:

అందరూ మెచ్చే మట్టి గాజులే కాదు విభిన్న గాజులు ఆకర్షింపచేస్తాయి. ముఖ్యంగా లక్కగాజులు చాలా ప్రత్యేకం. ఇవి తయారు చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఐదు రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు ఖరీదు చేసే గాజులు హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరికీ కావాల్సిన డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లాడ్‌ బజార్‌ గాజులు వేసుకోవడం ప్రతి మహిళ కల.

ప్రస్తుతం లాడ్‌బజార్​లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం రూ.25 లక్షల నుంచి 50 లక్షల వరకు వ్యాపారం చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.