ETV Bharat / state

మహిళా శిశు సంక్షేమశాఖకు ఎంత కేటాయించారంటే?

2021-22 రాష్ట్ర బడ్జెట్​ను మంత్రి హరీశ్​రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులో మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1,702 కోట్ల నిధులను బడ్జెట్​లో కేటాయించారు.

author img

By

Published : Mar 18, 2021, 2:20 PM IST

మహిళా శిశు సంక్షేమశాఖ - రూ.1,702 కోట్లు
మహిళా శిశు సంక్షేమశాఖ - రూ.1,702 కోట్లు

తెలంగాణ రాష్ట్ర వార్షిక పద్దులో మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1,702 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులందరికీ 2020-21 సంవత్సరంలో, వడ్డీలేని రుణాల రూపంలో మొత్తం 9,803 కోట్ల రూపాయలను బ్యాంకులు అందించాయని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం 3వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయించినట్లు చెప్పారు.

ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 136.44 కోట్ల రూపాయలు వెచ్చించి.. నాలుగు లక్షల మంది గర్భిణీ స్త్రీలకు చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. పోలీసు నియామకాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు సభలో గుర్తు చేశారు. మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7వేల 10 షీ టాయిలెట్లను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లను నిర్మించాలని భావించినట్లు వెల్లడించారు. వాటి నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు బడ్జెట్​లో ప్రతిపాదించారు.

మహిళలు గర్భదారణ నుంచి ప్రసవం జరిగే వరకు మూడు దశల్లో 4వేల చొప్పున, మొత్తం 12వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పేద మహిళలకు 8 లక్షల 71వేల 340 మందికి కేసీఆర్​ కిట్స్ పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రసూతి మరణాలు 2013-14లో లక్ష మందికి 92 ఉంటే.. నేడు అది 63కు తగ్గినట్లు తెలిపారు. శిశు మరణాల రేటు 39 నుంచి 26కు తగ్గినట్లు వెల్లడించారు. ఇది ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్​ పథకాలు సాధించిన గొప్ప ఫలితమని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.