tight sleep helps in career growth : మీరు కెరియర్‌లో ముందుకెళ్లాలనుకుంటున్నారా? అయితే... చక్కగా కంటినిండా నిద్రపోండి. ఇదేం పరిష్కారం అనుకుంటున్నారా! ఇది నిజమే అంటోంది వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం. మహిళలు కంటినిండా నిద్రపోతే చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది వాళ్లని కెరియర్‌లో దూసుకెళ్లేలా చేస్తుందని అంటున్నారు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లీషెపర్డ్. అలాగని ఈ సూత్రం మగవాళ్లకూ పనిచేస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్టే.
ఇది ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తుందట. ఎందుకంటే.. ఒక విషయాన్ని మగవాళ్లు తేలిగ్గా తీసుకుంటే, అదే విషయాన్ని ఆడవాళ్లు మనసుకు పట్టించుకుంటారట. అలాగే కుటుంబం బాధ్యతలు, పని ఒత్తిడి, ఆఫీసులో జరిగిన చిన్నచిన్న విషయాలు వంటివన్నీ వాళ్లని గాఢనిద్రకు దూరం చేస్తాయట. అందుకే అవసరం లేని విషయాలని పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోండి. అవసరమైతే మెడిటేషన్ చేయండి. ఇది తక్కువ సమయంలో ఎక్కువ సమయం పడుకున్న ఫలితాన్నిస్తుందని చెబుతోంది ఈ అధ్యయనం.
ఇవీ చదవండి: