మీరు వెంటనే పెళ్లికి ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని రిజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయి మంచివాడైతే మీరు అనవసరంగా మిస్సైన వాళ్లవుతారు. ఒకవేళ అతనిని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారు చెప్పిన విషయాలు నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య అనుబంధమే కాదు.. పెళ్లి తర్వాత ఒకరి కోసం ఒకరు చాలా అలవాట్లను, పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది మీ కుటుంబానికి మీరు చేస్తోన్న సహాయం మీద ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఇకపోతే మీ కుటుంబానికి మీరు చేసేది కేవలం సహాయం మాత్రమే కాదు.. అది మీ బాధ్యత కూడా. కాబట్టి, ఈ సమయంలో మీ బాధ్యతను వదిలి పెళ్లి చేసుకోవడమనేది మీ చెల్లి చదువుకి ఆటంకం కలిగించవచ్చు. ఒకవేళ మీ చెల్లికి ఉద్యోగం వచ్చినా మరొక చెల్లి ఉంది కాబట్టి అప్పుడు కూడా ఇద్దరూ బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. వాస్తవానికి 'పెళ్లైన తర్వాత ఆడపిల్లలు అమ్మానాన్నలను చూసుకోకూడదు.. పుట్టింటి గురించి పట్టించుకోకూడదు..' అనే రూలైతే ఎక్కడా లేదు.
కాబట్టి ఎక్కడైనా అవసరం అనుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ల పేరెంట్స్‌ని సపోర్ట్ చేయాలి. అలా అని అత్తింటివారిని నెగ్లెక్ట్ చేయాలని కాదు. వాళ్లను చూసుకుంటూనే వీళ్లను కూడా చూసుకునే రైట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో- ఆర్థికంగా భారం కాకుండా ఉండడం కోసం పెళ్లిని కొంతకాలం వాయిదా వేయడం మంచిదని అతనికి అర్ధమయ్యేలా చెప్పండి.
ఇవీ చదవండి: భాగ్యనగరంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్