విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర లక్షలు దండుకున్న మాయలేడిని చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు... విజయవాడలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన సంధ్య నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని... విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నాయుడుపేటకు చెందిన పవన్‌కుమార్ వద్ద నుంచి రూ.14 లక్షలు తీసుకుంది.
కొద్ది రోజులకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చంద్రగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తమ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితురాలు విజయవాడలో ఉన్నట్లు గుర్తించి... గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడినుంచి చంద్రగిరికి తీసుకొచ్చి... కడప సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఆమెపై గుంటూరులో రెండు చీటింగ్ కేసులు పెండింగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం.. ఇద్దరు మహిళల అరెస్ట్