మూసివేసిన వైన్స్ షాపులకు భద్రత కల్పించాలంటూ తెలంగాణ వైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో వైన్స్ షాపులు మూసివేశామని తెలిపారు. గత కొన్ని రోజులుగా మద్యం దొరకక ... దుండగులు మద్యం షాపులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యానికి బానిసైన కొంతమంది వ్యక్తులు, షాపుల తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగానే కొనసాగితే... రాష్ట్రంలోని వైన్స్ షాపుల యజమానులు రోడ్డున పడతారని వాపోయారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహించాలని కోరారు. వైన్స్ షాపుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చర్యలు తీసుకోవాలని ఆయన సీపీకి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..