ఇవీ చూడండి : 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'
'భాగ్యనగరాన్ని...కాలుష్య నగరంగా మార్చాలని చూస్తున్నారు' - 'భాగ్యనగారాన్ని దౌర్భాగ్యనగరం చేస్తారా కేటీఆర్' ?
హైదరాబాద్ మహా నగరంలో కాలుష్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని భాజపా నాయకురాలు కరుణాగోపాల్ ఆరోపించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొన్న కేటీఆర్ హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడన్నారు. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటే మరింత కాలుష్య నగరంగా మార్చాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ చర్యల వల్ల హైదరాబాద్ నగరం ఐసీయూలోకి వెళ్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నగరాన్ని పట్టించుకోకుండా నిద్ర పోతున్నాడని ఎద్దేవా చేశారు
!['భాగ్యనగరాన్ని...కాలుష్య నగరంగా మార్చాలని చూస్తున్నారు' కేటీఆర్ చర్యల వల్ల ఐసీయూలోకి హైదరాబాద్ : కరుణ గోపాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5826771-thumbnail-3x2-bjp.jpg?imwidth=3840)
కేటీఆర్ చర్యల వల్ల ఐసీయూలోకి హైదరాబాద్ : కరుణ గోపాల్
ఇవీ చూడండి : 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'
sample description
TAGGED:
BjP LEADER KARUNA GOPAL