సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ-యుసీసీసీ ప్రతినిధులతో వినోద్ కుమార్ తన సమావేశంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రిస్టియన్‌లకు జెరుసలేం పవిత్ర యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వపరంగా రాయితీ ఇప్పించాలని యూసీసీసీ ప్రతినిధులు వినోద్‌ను కోరారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.
యూసీసీసీ ఆధ్వర్యంలో 18 నుంచి క్రిస్మస్ వేడుకలు...
చదువు వజ్రాయుధమని, అందుకే సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. యూసీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వినోద్ కుమార్‌ను ఆహ్వానించారు.
ఇవీ చూడండి : విల్లామేరి కాలేజిలో విద్యార్థుల డిజైన్ ఉత్పత్తుల ప్రదర్శన