ETV Bharat / state

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా: ఇందిరారావు - తెలంగాణ తాజా వార్తలు

హిమాయత్​నగర్ డివిజన్​లో తాగునీరు, డ్రైనేజీ, రహదారి, ట్రాఫిక్​ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఇందిరారావు హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

himayat nagar congress candidate
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా: ఇందిరారావు
author img

By

Published : Nov 28, 2020, 9:07 AM IST

హిమాయత్​నగర్ డివిజన్​లో తెరాస, భాజపా అభ్యర్థుల భర్తల పెత్తనమే తన గెలుపునకు మార్గం సుగమం చేస్తుందని కాంగ్రెస్​ అభ్యర్థి ఇందిరారావు ధీమా వ్యక్తంచేశారు. వారి ఆగడాలకు నుంచి ప్రజలకు విముక్తి కావాలంటే తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

తాగునీటి, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్, మూసీ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. భారీ వర్షాలకు హిమాయత్​నగర్​ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఇందిరారావు.. నాలాకు ఇరువైపుల ప్రహరీ గోడలు నిర్మిస్తామని, ముంపు సమస్యకు చెక్​పెడతానని స్పష్టం చేశారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హిమాయత్​నగర్​ డివిజన్​ను అభివృద్ధి పథంలో తీసుకెళతానని ఇందిరరావు స్పష్టం చేశారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా: ఇందిరారావు

ఇవీచూడండి: ఈ ఎన్నికలు హైదరాబాద్‌ - భాగ్యనగరం మధ్య: అసద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.