ETV Bharat / state

Who is Hyderabad New CP : హైదరాబాద్‌ సీపీ ఎవరు?.. పరిశీలనలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు

Who is Hyderabad New CP : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పలువురు 20 మంది అధికారులను ఈసీ బదిలీ చేసింది. అందులో హైదరాబాద్​ సీపీ, ఇతర నగరాల పోలీస్ కమిషనర్లు ఉన్నారు. ఆ పోస్టులు ఖాళీ అవ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్​గా ఎవరు వస్తారన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పరిశీలనలో ముగ్గురు అధికారుల పేర్లు ఉండగా.. వారిలో ఉత్తరాది అధికారులకే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

EC Transfers Collectors and SPs in Telangana
Hyderabad New CP Name
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 10:13 AM IST

Who is Hyderabad New CP : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని.. అందుకు గానూ పలువురి పేర్లను ప్రతిపాదించి పంపాలని సీఈసీ రాష్ట్ర సీఎస్​కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి 17 మందితో కూడిన జాబితాను పంపినట్లు సమాచారం.

Hyderabad New CP : బదిలీ అయిన స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సీపీగా ఎవరు వస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో నియమించేందుకు పలువురు పేర్లలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారినే హైదరాబాద్​ సీపీగా నియమించేందుకు ఎన్నికల కమిషన్​ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా అందులో ఇద్దరు మాత్రం ఉత్తర భారతానికి చెందినవారు కావడంతో వారిలో ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

EC Transfers 20 Officers In Telangana : తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్‌ శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌లకు ఎక్కవగా అవకాశాలు ఉన్నాయి. వారు కాకుండా చాలా కాలంగా ప్రాధాన్యత సంతరించుకోలేని పోస్టుల్లో ఉద్యోగం చేస్తున్న కొత్తకోట శ్రీనివాస రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ముక్కుసూటి అధికారిగా పేరు పొందిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అదనపు డీజీగా పనిచేస్తున్నారు. మహేశ్​ భగవత్​కు అవకాశం లభించవచ్చని ప్రచారం జరిగినప్పటికీ మునుగోడు ఉపఎన్నికలు జరిగినప్పుడు ఆయన రాచకొండ కమిషనర్​గా పనిచేశారు. చౌటుప్పల్ రాచకొండ పరిధిలోకి రావడం ఇప్పుడు ఆయన నియామకానికి ఆటంకంగా మారింది.

Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!

EC Transfers Collectors and SPs in Telangana : హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​గా సహా, కమిషనర్ల పోస్టుకు సంబంధించి రాష్ట్రంలో పని చేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారుల లిస్ట్​ పంపాలని ఈసీ సీఎస్​ను కోరినట్టు తెలుస్తోంది. సీఎస్ శాంతి కుమారి 17 మందితో కూడిన జాబితాను పంపించినట్లు సమాచారం. అలానే అందులో ముగ్గురి వివరాలను వేరుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన కమిషనర్ల పోస్టులకు సీనియర్​ ఐపీఎస్​లు, ఎస్పీల పోస్టులకు 2014, 2015, 2016, 2017 బ్యాచ్​ల ఐపీఎస్​ల పేర్లను ప్యానల్​లో పెట్టినట్టు సమాచారం. ఇక వేటుకు గురైన పది మంది ఎస్పీలలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్​కు మాత్రమే ఐపీఎస్​ హోదా ఉంది. మిగతా వారంతా నాన్​క్యాడర్​ ఎస్పీలే. వీరందరి స్థానంలో ఐపీఎస్​లనే నియమించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం.

EC Appointed Temporary Police Officer in Telangana : బుధవారం రాష్ట్రంలోని నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలను, మరో మూడు శాఖలకు సంబంధించిన కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ(EC) ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తాత్కలికంగా ఖాళీ అయిన స్థానంలో అధికారులను నియమించింది. హైదరాబాద్‌ తాత్కాలిక సీపీగా అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ మాన్​ను నియమించింది. వరంగల్ సీపీగా నేర విభాగం డీసీపీ మురళీధర్, నిజామాబాద్‌ సీపీగా ఎస్‌. జయరామ్​లను నియమించింది. మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ

ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు... భాస్కరన్​కు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.