ETV Bharat / state

సందిగ్ధంలో సర్కారు: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?

ఎల్​ఆర్​ఎస్​ లేని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిష్కార విషయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. ఈ విషయమై నాలుగు ఐచ్చికాలు ప్రభుత్వం ముందు ఉన్నట్లు సమాచారం.

what-is-the-future-planning-on-lrs-act-implementation-in-telangana
కసరత్తు షురూ: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?
author img

By

Published : Dec 27, 2020, 5:14 AM IST

Updated : Dec 27, 2020, 10:11 AM IST

అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించి యజమానులు రుసుము చెల్లించినతర్వాత క్రమబద్ధీకరించాలి. అయితే ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఎల్ఆర్ఎస్ లేని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగకపోవడం ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. తాజా ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులతో పాటు 2015లో దరఖాస్తు చేసుకొని పరిష్కారం కాని వాటి పరిస్థితి అలానే ఉంది. కార్డు పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ లేని వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీనితో ఆయా ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

నాలుగు ఐచ్ఛికాలతో...

మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జనవరి నెలాఖరుతో క్రమబద్ధీకరణ రుసుము చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి. కానీ... ఇప్పటికీ దరఖాస్తుల పరిష్కారమే ప్రారంభం కాలేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లస్టర్లు, గ్రూపులుగా విభజించి పరిష్కరించాలని పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఫీర్జాదిగూడ నగరపాలికలో పైలట్ పద్ధతిన కొంత ప్రక్రియ కూడా చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం నాలుగు ఐచ్ఛికాలను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

కొనుగోలుదారు నుంచి ప్రత్యేక అఫిడవిట్​

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటిని మళ్లీ అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ జరగని వాటికి మాత్రం ఎల్​ఆర్​ఎస్​ చట్టం వర్తింప చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ సమయంలోనే ఎల్​ఆర్​ఎస్​ మొత్తం చెల్లించేలా నిబంధన పెట్టడమా లేదా? అనే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే కొనుగోలు దారుడి నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్‌ తీసుకోనున్నట్లు తెలిసింది. అందులో రిజిష్టర్‌ స్థలం ప్రభుత్వ భూమి, శిఖం స్థలం కాదని, ఎఫ్​టీఎల్​ సహా నాలా పరిధిలో లేదని ఇలా పలు అంశాలను స్పష్టం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని నిబంధనలతో ఇలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్లను అనుమతించాలన్న అంశంపై కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వచ్చినందున వీటి పరిష్కారానికి సమయం తీసుకునే నేపథ్యంలో అంతవరకు ఇబ్బందుల్లేకుండా కొంత సరళీకృతం చేసే ఆలోచనతో అన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'వాజ్‌పేయీ ఆలోచనలను అర్థం చేసుకోవడం కష్టం'

Last Updated : Dec 27, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.