ETV Bharat / state

ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా? - కరోనా వైరస్ వార్తలు

కరోనా వైరస్‌ నివారణకు మాదాపూర్‌లోని జైన్‌ శ్రీకర్‌ అపార్టుమెంట్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ అపార్టుమెంట్‌ వాసులను అప్రమత్తం చేశారు. వైరస్‌ సోకకుండా చర్యలు చేపట్టారు. వాటి గురించి తెలుసుకుందామా..

What if Corona didn't get into jain srikar apartment at hyderabad
ఈ అపార్టుమెంట్‌లోనికి కరోనా రాకుండా ఏం చేశారంటే...!
author img

By

Published : Mar 20, 2020, 4:18 PM IST

  1. అపార్టుమెంట్‌లోని కామన్‌ ఏరియాను మొత్తం లిసో ప్రొపైల్‌ ఆల్కాహాల్‌తో ప్రతిరోజు శానిటైజేషన్‌ చేస్తున్నారు. ముఖ్యంగా లిఫ్ట్‌లు, స్విచ్‌లు, రెయిలింగ్స్‌, టేబుళ్లు, డోర్‌ హ్యాండిళ్లు శుభ్రం చేస్తున్నారు.
  2. స్ప్రేలు,శానిటైజర్స్‌, ఫేస్‌మాస్కులను ముందుస్తుగా అపార్టుమెంట్‌లో నిల్వ ఉంచారు.
  3. జిమ్‌, ఈతకొలను, క్లబ్‌హౌజ్‌ను మూసేశారు.
  4. సామూహిక కార్యక్రమాలు, వేడుకల నిర్వహణను నిషేధించారు.
  5. స్విగ్గీ, ప్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ నుంచి వచ్చే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాయ్స్‌ను అపార్టుమెంట్‌ లోపలికి అనుమతించడం లేదు. పార్సిళ్లను సెక్యూరిటీకి అందజేసి వెళ్లాలి.
  6. అపార్టుమెంట్‌ లోపలికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు నాన్‌ కాంటాక్ట్‌ థర్మోమీటర్లు ఉంచారు. ప్రతిఒక్కరిని గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు.
  7. ప్రతి లిఫ్ట్‌ వద్ద టూత్‌పిక్‌లను ఉంచారు. లిఫ్ట్‌ బటన్‌ను టూత్‌పిక్‌తోనే నొక్కాలని సూచించారు. వాడిన టూత్‌పిక్‌లను లిఫ్ట్‌ ఆవరణలో ఉంచిన ట్రాష్‌బిన్‌లో మాత్రమే వేయాలి.
  8. అపార్టుమెంట్‌లో ఉంటున్నవారు ఎవరైనా విమాన ప్రయాణం చేసి వస్తే 15 రోజులపాటు స్వీయ క్వారంటైన్‌లో ఉండాలి.
  9. పనిమనుషులు మాస్కులు ధరించాలి. తరుచూచేతులు కడుక్కునేందుకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

ఇవీచూడండి: ' స్క్రీనింగ్​కు అందరూ సహకరించండి..మంత్రి గంగుల వినతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.