ETV Bharat / state

చేతులు కడుక్కోండి.. ఆరోగ్యంగా ఉండండి!

author img

By

Published : May 10, 2021, 11:38 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గంటగంటకూ హ్యాండ్‌వాష్‌, శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో చేతుల్ని పరిశుభ్రంగా రుద్ది మరీ కడుక్కోమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మే 5న ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’. ఈ సందర్భంగా ‘Seconds save lives – clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ క్రమంలో చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కొవిడ్‌తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది.

world hand hygiene day
వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే

ఏటా మే 5న ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’ పేరిట చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ అల్లకల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో చేతి పరిశుభ్రత గురించి మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో ఈసారి ‘Seconds save lives – clean your hands’ అనే థీమ్‌తో మనముందుకొచ్చింది. చేతుల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవడం వల్ల కొవిడ్‌ వైరస్‌తో పాటు మన చుట్టూ ఉండే ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చని చెప్పడమే ఈ థీమ్‌ ముఖ్యోద్దేశం. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పదే పదే చేతుల్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడచ్చని చెబుతోందీ సంస్థ. వీరితో పాటు ప్రతి ఒక్కరూ తమ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యమివ్వాలంటోంది. ఈ నేపథ్యంలో సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి..? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.

handwashneglectproblems650.jpg
చేతుల పరిశుభ్రత

ఎలా శుభ్రపరచుకోవాలి?

కరోనా వైరస్‌ కరచాలనం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. వైరస్‌ సోకిన వ్యక్తితో కరచాలనం (షేక్‌ హ్యాండ్‌) చేయడం, వైరస్‌ ఉన్న వ్యక్తి తాకిన వస్తువులనే మనమూ తాకడం.. ఇలాంటి పనుల వల్ల వైరస్‌ మన చేతులకు అంటుకుంటుంది. అయితే ఇదే చేతులతో కళ్లు, ముక్కును నలపడం.. భోంచేయడం.. వంటి వాటి వల్ల ఆ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే కరోనాను కట్టడి చేయాలంటే ముందు మనం దాని వ్యాప్తిని ఆపాలి. అది జరగాలంటే ఎవరి చేతులను వాళ్లు వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు, ప్రముఖ ఆరోగ్య సంస్థలు సైతం పదే పదే ఇదే మాటను చెబుతున్నాయి. ఈ క్రమంలో చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎంతసేపు శుభ్రం చేసుకోవాలో వాళ్లు సవివరంగా తెలిపారు.

* ముందు మీ చేతులను శుభ్రమైన నీటి (చల్లని/గోరువెచ్చని) ధార కింద ఉంచి వాటిని తడపాలి.

* ఇప్పుడు చేతులకు సబ్బు రాసి నురుగు వచ్చేలా రుద్దండి. ఈ క్రమంలో కేవలం అరిచేతులనే కాకుండా, వేళ్ల మధ్యన, చేతుల వెనక భాగంలో, గోళ్ల కింద.. ఇలా ప్రతి భాగాన్నీ బాగా రుద్దాలి.

* ఇప్పుడు నీటి ధార కింద చేతులను పెట్టి సబ్బు పూర్తిగా తొలగిపోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. చివర్లో నీటి ధార కింద అరచేతులు పెట్టి కడుక్కోవడం మంచిది. దీనివల్ల ఏవైనా మలినాలు, సబ్బు అవశేషాలు మిగిలిపోతే నీటితో పాటు అవీ వెళ్లిపోతాయి.

* ఇప్పుడు శుభ్రమైన టవల్‌, రుమాలు, టిష్యూ పేపర్‌ లేదా ఎయిర్‌ డ్రయర్‌తో మీ చేతులను పొడిగా చేసుకోవాలి. అయితే ఇంట్లో ఒకరు వాడిన రుమాళ్లు, టవల్స్‌ మరొకరు వాడకపోవడం మంచిది.

* ఉంగరాలు ధరించే వారైతే వాటి చుట్టుపక్కల సబ్బుతో మరింత ఎక్కువగా రుద్దాలి. వీలైతే ఉంగరాలు తీసేసి చేతుల్ని, ఉంగరాలను శుభ్రం చేసుకున్న తర్వాత మళ్లీ వాటిని పెట్టుకోవడం మేలు.

* పొడవాటి గోళ్లు ఉన్న వారైతే చేతులు కడుక్కునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గోళ్లలో బ్యాక్టీరియా, వైరస్‌ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి గోళ్లలో మురికి లేకుండా శుభ్రపరచుకోవడం అవసరం. వీలైతే గోళ్లను పొడవుగా పెంచుకోకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం.

ఆ పాటే మీకు టైమర్‌..!

అయితే సబ్బుతో చేతులను ఎంతసేపు రుద్దుకోవాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. సబ్బుతో చేతులను కనీసం 20 నుంచి 30 సెకన్ల పాటు రుద్దాలని చెబుతోంది యునిసెఫ్‌. అయితే చేతులు కడిగే సమయంలో 20 సెకన్లను లెక్కపెట్టడానికి ఓ సులభమైన మార్గాన్ని కూడా వాళ్లు సూచిస్తున్నారు. అదేంటంటే మనం పుట్టినరోజు వేడుకల్లో పాడే ‘హ్యాపీ బర్త్‌డే’ పాటను మొదటి నుంచి చివరి వరకు రెండుసార్లు పాడమంటున్నారు. మీరు చేతులు కడగడం ప్రారంభించగానే ఈ పాట పాడడం కూడా మొదలుపెట్టండి. ఆ పాట రెండుసార్లు పాడడం పూర్తయ్యేలోపు మీ చేతులను నీటితో కడిగేసుకోవచ్చు.

ఎప్పుడెప్పుడు కడగాలి..?

మనం రోజులో ఎప్పుడెప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలో చూద్దాం..!

* దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెంటనే చేతులు కడుక్కోవాలి. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎవరైనా సపర్యలు చేస్తే.. వాళ్లు కూడా చేతులు కడుక్కోవాలి.
* ముక్కు చీదిన తర్వాత..
* వంట చేయడానికి ముందు, తర్వాత..
* ఏదైనా తినడానికి ముందు, తర్వాత..
* పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు..
* గాయాలను శుభ్రపరిచే ముందు, తర్వాత..
* మల, మూత్ర విసర్జన ముందు, తర్వాత..
* పిల్లలు టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత శుభ్రం చేసినప్పుడు, వాళ్ల డైపర్లను మార్చిన తర్వాత..
* పెంపుడు జంతువులను తాకిన తర్వాత, వాటికి ఆహారం పెట్టిన తర్వాత..
* చెత్త ముట్టుకున్న తర్వాత..
* కాంటాక్ట్‌ లెన్సులు వాడే వాళ్లు.. అవి పెట్టుకోవడానికి ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి.

ఇదీ చదవండి: కరోనా రెండో ఉద్ధృతికి పల్లెలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.