గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జాతీయ స్థాయి హ్యాండ్‌లూమ్ వస్త్ర ప్రదర్శన ఏర్పాటైంది. నేషనల్ సిల్క్ ఎక్స్పో-2019 పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆంధ్ర మిస్ క్వీన్, సినీ కథానాయిక సంధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను వీక్షిస్తూ....వాటిని ప్రదర్శిస్తూ సందడి చేశారు. భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉందని...చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు. దేశంలోని 14 నగరాలకు చెందిన చేనేత కారులు తయారు చేసిన 50వేల రకాల వస్త్ర ఉత్పత్తులున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 22 వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని వారు పేర్కొన్నారు.
'భారతీయ సంస్కృతిలో చేనేతది ప్రత్యేక స్థానం' - నేషనల్ సిల్క్ ఎక్స్ ఫో-2019
భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉందని సినీ కథానాయిక సంధ్య అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నేషనల్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు.