తెలంగాణ సాధించుకున్న తర్వాత నేతన్నల ఆకలి చావులు ఉండవన్న ముఖ్యమంత్రి కేసీఆర్... చేనేత రంగాన్ని పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో... మార్చి11న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన "చేనేత వర్గాల - ధర్మ పోరాట దీక్ష " పోస్టర్ను కమిటీ ఛైర్మన్ దాసు సురేష్తో కలిసి ఆవిష్కరించారు.
రాష్ట్రంలో నిజాం పాలన కంటే దారుణంగా పాలన సాగుతోందని కృష్ణయ్య మండిపడ్డారు. ఈ ధర్మ పోరాట దీక్షకు చేనేతలతో పాటు అన్ని వర్గాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ ఛైర్మన్ సురేష్ విజ్ఞప్తి చేశారు.