రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని తెలిపింది. ఇవాళ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పశ్చిమ, నైరుతి తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు... విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు