రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్‌పల్లి, మంచిప్పలలో 45.5, మోర్తాడ్, లక్ష్మాపూర్‌లలో 45.3 డిగ్రీలు ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా బేల, జైనథ్‌లో 45.4, రామగుండంలో 44, హైదరాబాద్‌లో 41.2 డిగ్రీలుగా నమోదయింది. ఇవి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
ఉడుకుతున్న తెలంగాణం
వాయువ్య భారతంలోని రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి. విదర్భను ఆనుకొని ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ అధిక వేడిమితో ఉడుకుతోంది. ఎండ వేడి అధికంగా ఉంటున్నందున పగటి పూట బయట తిరగటం ఆరోగ్యానికి మంచిది కాదని.. ఆప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. వాయువ్యం నుంచి వీస్తున్న పొడిగాలులు రాష్ట్రంలోని గాలిలో తేమను మింగేస్తున్నాయి. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత అధికంగా ఉంటోంది.
ఇవీ చూడండి: నేడు ఓరుగల్లు ప్రథమ పౌరుడి ఎన్నిక