రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తా, ఒడిశా దాని పరిధిలో ఉన్న బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైఋతి వైపునకు వంపు తిరిగి రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు-పశ్చిమ ప్రాంతం నుంచి భారతదేశం మీదుగా 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిందని తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురవడంతోపాటు.. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇదీ చూడండి : 'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి సీఎంకు ఇబ్బంది ఏంటి'