ETV Bharat / state

లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు - తెలంగాణ తాజా వార్తలు

లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు

author img

By

Published : May 26, 2021, 9:08 PM IST

Updated : May 26, 2021, 9:59 PM IST

21:03 May 26

లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతాం: జూడాలు

తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో జూనియర్‌ వైద్యుల (జూడాలు) చర్చలు ముగిశాయి. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు. విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు.

‘‘కొవిడ్‌ మృతులకు పరిహారం ఇవ్వబోమని డీఎంఈ చెప్పారు. కొవిడ్‌ సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్‌లో బెడ్‌లు ఇచ్చే అంశం లేదన్నారు. 10శాతం కొవిడ్‌ ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఈ ఏడాది జనవరి లేదా ఈ నెల నుంచి 15శాతం హైక్‌ ఇస్తామన్నారు. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చూసి సమ్మె విరమించాలని అనుకున్నాం. కానీ.. డీఎంఈతో చర్చల్లో మాకు సరైన హామీ రాలేదు. ప్రస్తుతానికి మా సమ్మె కొనసాగిస్తున్నాం’’ అని జూడాలు వివరించారు.

ఇదీ చూడండి: kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్

Last Updated : May 26, 2021, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.